హైదరాబాద్‌లో అమృత స్వాతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యూనిఫామ్స్, మాస్కులు, శానిటైజర్స్, గ్లౌస్లు అందించారు. మానవ హక్కుల సంఘం సభ్యుడు ఇర్ఫాన్, వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ట్రస్ట్ అధ్యక్షుడు ధనాల శ్రీనివాస్‌రెడ్డి వీటిని పంపిణీ చేశారు.
లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేసేందుకు పోలీసులు ఎనలేని కృషిచేస్తున్నారని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సభ్యుడు ఇర్ఫాన్ ప్రశంసించారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, దుస్తులు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన అమృత స్వాతి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు ధనాల శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు.
కరోనా వంటి ఆపత్కాల సమయంలో వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి పోలీసులు పనిచేస్తున్నారని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల కృషిని గుర్తించినందుకు ట్రస్ట్ బృందాన్ని అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, స్వాతి ఆత్మ తప్పక శాంతిస్తుందని అన్నారు.