Bopparaju on prc:పీఆర్సీ 27 శాతం కంటే తక్కువ ప్రకటిస్తే.. ప్రభుత్వానికే మర్యాద కాదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అధికారుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం పీఆర్సీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. ఇరు జేఏసీల ఐక్య వేదిక 55 శాతం పీఆర్సీని డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.
ఇక్కడికన్నా.. తెలంగాణలోనే ఎక్కువ : బొప్పరాజు
Bopparaju on prc: అధికారుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం పీఆర్సీ.. తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వం 27 శాతం కంటే తక్కువ పీఆర్సీ ప్రకటిస్తే.. వారికే మర్యాద కాదని అన్నారు.
bopparaju: ఇక్కడికన్నా.. తెలంగాణలోనే ఎక్కువ : బొప్పరాజు
పీఆర్సీ అంశంతో పాటు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు తదితర అంశాలను చర్చించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. 27 శాతం కంటే తక్కువ పీఆర్సీ ప్రకటిస్తే.. ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో ఇక్కడి కంటే ఎక్కువ ఇస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: