తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ - సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు

ఏపీలోని మందడం వద్ద సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా జై అమరావతి.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. సంక్షేమాల పేరిట ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.

amravati-farmers-protest-against-cm-jagan-at-mandadam-guntur-district
ఏపీ సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ

By

Published : Feb 23, 2021, 4:28 PM IST

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా మందడం వద్ద రైతులు జై అమరావతి, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అమరావతి భూములను విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు.

రేషన్ బియ్యం ఇచ్చేందుకు రూ.4 వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలు అప్పుడే మూలనపడుతున్నాయని అన్నదాతలు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులను వృథా చేస్తున్నారని.. వాటితో రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు.

ఏపీ సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ

ఇదీ చదవండి: తెరాస నేతలతో రేపు కేటీఆర్​ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details