తెలంగాణ

telangana

ETV Bharat / city

అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా... - Amminpur Minor rape case latest news

అనాథ ఆశ్రమానికి చెందిన బాలిక మృతిచెందిన ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. బాలిక మృతికి గల కారణాల్ని కూలంకషంగా దర్యాప్తు చేసి వారం లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులతో పాటు భరోసా కేంద్రం, బాలిక సంరక్షణ కేంద్రం, నిలోఫర్ ఆసుపత్రి వైద్యుల నుంచి వివరాలు సేకరించనున్నారు. పూర్తి వివరాలతో నివేదికను కమిటీ సమర్పించనుంది. ఈ కేసులో నిందితులను పోలీసులు నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

Amminpur rape case update news
అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

By

Published : Aug 13, 2020, 8:30 PM IST

రాష్ట్రంలో సంచలనం రేపిన 14 ఏళ్ల అనాథ బాలిక మృతి ఘటనపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అపర్ణ, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ, మహిళా భద్రత విభాగం డీఎస్పీ చెన్నయ్య, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు సునంద ఉన్నారు.

నిలోఫర్ సూపరింటెండెంట్‌కు తాఖీదులు

బాలిక మృతిపై... పూర్తి వివరాలివ్వాలని భరోసాకేంద్రం సహా నింబొలిఅడ్డలోని బాలికల సంరక్షణ కేంద్రం అధికారులకు నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యానికి సంబంధించిన వివరాలివ్వాలని సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చారు. శవపరీక్ష నివేదిక ఇవ్వాలని ఉస్మానియా వైద్యులను కోరారు. కేసు నమోదుకు సంబంధించి బోయిన్ పల్లి, జీడిమెట్ల, అమీన్ పూర్ ఇన్స్‌పెక్టర్‌లకు నోటీసులు ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో బాలిక ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి మృతిచెందే వరకు చోటు చేసుకున్న పరిణామాలు అన్నింటినీ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

నిందితులను నాలుగు రోజుల కస్టడీ

అమీన్‌పూర్‌లోని మారుతిహోమ్‌లో ఉంటున్న 14ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి కోరగా కోర్టు అందుకు అనుమతించింది. అత్యాచారానికి పాల్పడిన వేణుగోపాల్ రెడ్డితో పాటు సహకరించిన మారుతి హోం నిర్వహకులు విజయ, జయదీప్​ను పోలీసులు కస్టడీలో తీసుకొని ప్రశ్నించనున్నారు. మారుతి హోం‌ను ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారు... విరాళాలు ఎవరెవరినుంచి స్వీకరిస్తున్నారనే కోణంలో పోలీసులు నిందితులను ప్రశ్నించనున్నారు.

పరిశ్రమలో పనిచేసేవారితో విరాళాలు

ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అందులో పనిచేసేవాళ్లు జన్మదిన వేడుకలు, ఇతర శుభ కార్యాలు జరిగినప్పుడు ఆశ్రమానికి తీసుకు వచ్చి వారిచేత విరాళాలు ఇప్పించేవాడు. ఇలా నిర్వహకులతో పరిచయం పెంచుకొని దాన్ని అలుసుగా తీసుకుని 14ఏళ్ల బాలికపై కన్నేసినట్టు పోలీసులు గుర్తించారు. విరాళాలు వస్తాయని ఆశతో నిర్వహకురాలు విజయ సైతం వేణుగోపాల్ రెడ్డికి సహకరించి బాలికను అతని వెంట భవనం పైకి పంపించినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

రాష్ట్రంలో దాదాపు 600 వరకు ఉన్నా అనాథ ఆశ్రమాలపై మరింత పర్యవేక్షణ పెంచేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఘటనకు పాల్పడిన బాధ్యలందరినీ ఉరితీయాలని అఖిల భారత మానవహక్కులు సలహాదారు లావణ్య డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు

ABOUT THE AUTHOR

...view details