ఎంపీ సంతోశ్ కుమార్ ప్రారంభించిన హరిత సవాల్(Green India Challenge) ఉద్దేశాన్ని గ్రహించిన రామోజీ సంస్థలు.. పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తూ.. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్‌స్టార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సినీ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. వీరందిరికి ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి మొక్కలను అందించారు. రామోజీ ఫిలిం సిటీలోని సాహస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన అమితాబ్..
ప్రాజెక్ట్-కె చిత్ర షూటింగ్ కోసం అమితాబ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం గురించి తెలుసుకుని పర్యావరణ పరిరక్షణకై తన వంతు బాధ్యతగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పటికే 16 కోట్ల మొక్కలు నాటారని విని.. అభినందించారు.
" భవిష్యత్ తరాలకు హరిత సవాల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఛాలెంజ్‌ను ఇలాగే కొనసాగించాలి. మొక్కలు నాటేందుకు ప్రముఖులంతా ముందుకు రావాలి. తమ అభిమానులను మొక్కలు నాటేలా ప్రోత్సహించాలి. నన్ను ప్రేమించే వారు కూడా మీ స్పెషల్ డే రోజున మొక్కలు నాటండి. మీకు ప్రత్యేకమైన వారికి మొక్కలనే గిఫ్ట్‌గా ఇవ్వండి."
- అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్
భావి భారత పౌరులకు గ్రీన్ ఇండియాను అందించే బాధ్యత నేటి తరానిదేనని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడుకునేెందుకే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge)ను ప్రారంభించానని తెలిపారు.
నాటడమే కాదు.. సంరక్షణా చూస్తున్నా..