తెలంగాణ

telangana

ETV Bharat / city

విమోచన వేడుకల కోసం వస్తున్న అమిత్​ షా.. షెడ్యూల్ ఖరారు - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

Amit Shah Hyderabad Tour: నిజాం రజాకార్ల పాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి పొంది 74 ఏళ్లు అవుతున్న తరుణంలో తెలంగాణా విమోచన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాజపా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ రానున్నారు. విమోచన దినోత్సవం రోజు గ్రామగ్రామాన జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో భాజపా నేతలు నిర్ణయించారు.

Amit Shah
Amit Shah

By

Published : Sep 15, 2022, 4:47 PM IST

Updated : Sep 15, 2022, 8:20 PM IST

Amit Shah Hyderabad Tour: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 17న హైదరాబాద్ రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం రాత్రి 9.50కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నేషనల్ పోలీస్ అకాడమీకి వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 17న ఉదయం 8.45కు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్​లో నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల కవాతు, గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు.

కోర్​ కమిటీతో భేటీ:11.10కు బేగంపేటలోని హరిత ప్లాజాకు వెళతారు. అక్కడ భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీతో సమావేశమవుతారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, తెలంగాణ విమోచన వేడుకలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.40కి ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లి అక్కడ అధికారిక కార్యక్రమానికి హాజరవుతారు. తిరిగి రాత్రి 7.35కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనమవుతారు.

Last Updated : Sep 15, 2022, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details