తెలంగాణ

telangana

ETV Bharat / city

జోరుమీదున్న భాజపా... రంగంలోకి అమిత్​ షా - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

బల్దియా బాద్​షాగా నిలిచేందుకు భాజపా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. ఇప్పటికే జోరుమీదున్న కమలం.. చివరి రోజున కూడా అదే ఊపును కొనసాగించాలని తహతహలాడుతోంది. అందులో భాగంగానే అమిత్​ షాను రంగంలోకి దించింది.

Amit Shah will arrive to Hyderabad tomorrow for ghmc election compaign
జోరు మీదున్న భాజపా... రంగంలోకి అమిత్​ షా

By

Published : Nov 28, 2020, 9:16 PM IST

గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో జోరు మీదున్న భాజపా... చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను రంగంలోకి దించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం అమిత్​ షా ఆదివారం హైదరాబాద్‌ రానున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

పర్యటన సాగనుందిలా...

  • ఉ.10 గం.కు బేగంపేట విమానాశ్రయానికి రాక
  • ఉ.10.45 గం.కు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన
  • ఉ.11.45 గం.కు వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండి హనుమాన్‌ గుడి వరకు రోడ్‌ షో
  • మ.1.30 గం.కు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నేతలతో భేటీ
  • సా.5.30 గం.కు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details