కోర్ కమిటీతో అమిత్ షా భేటీ.. పార్టీ బలోపేతం, చేరికలపై కీలక సూచనలు..! - state BJP core committee meeting
17:13 May 14
రాష్ట్ర భాజపా కోర్ కమిటీతో అమిత్ షా సమావేశం..
శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర భాజపా కోర్‌కమిటీతో కేంద్రమంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడి పని చేయాలని కమిటీ సభ్యులకు అమిత్‌షా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాశ్, మాజీ ఎంపీ వివేక్, డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రలతో కొంత ఆలస్యం అవుతుందని.. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగిందని.. ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ట్విటర్ వేదికగా వస్తున్న కామెంట్ల గురించి ప్రస్తావించిన అమిత్‌షా.. స్థానిక నేతలే వాటిని తిప్పికొట్టాలన్నారు. ఆపరేషన్ తెలంగాణపై కమిటీ సభ్యులకు అమిత్‌షా కీలక సూచనలు చేశారు. పార్టీలో కొత్తగా చేరే వారికి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వవచ్చు అనే దానిపై స్పష్టత ఇచ్చారని సమాచారం. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరిగిన సమావేశం అనంతరం.. తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు నేతలు తరలివెళ్లారు.
ఇవీ చూడండి: