తెలంగాణ

telangana

ETV Bharat / city

Amit Shah at TS Liberation Day celebrations : తెలంగాణ అమరవీరులకు అమిత్ షా ఘననివాళి - సికింద్రాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Amit Shah at Telangana Liberation Day celebrations : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

Amit Shah at TS Liberation Day celebrations
Amit Shah at TS Liberation Day celebrations

By

Published : Sep 17, 2022, 9:27 AM IST

Updated : Sep 17, 2022, 10:10 AM IST

తెలంగాణ అమరవీరులకు అమిత్ షా ఘననివాళి

Amit Shah at Telangana Liberation Day celebrations : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Telangana Liberation Day celebrations : ముందుగా కేంద్ర మంత్రి అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే. కర్ణాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

జాతీయ గీతాలాపన అనంతరం అమిత్ షా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన వేడుకల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహిస్తున్నాయి. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

Kishan reddy on Telangana Liberation Day : సెప్టెంబర్‌ 17 చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈరోజున నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడామని తెలిపారు. హైదరాబాద్ గడ్డపై తొలిసారిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురుతోందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణపతాకం ఎగరవేస్తుంటే... ఆనాడు నిజాం ప్రభువు అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించారని వెల్లడించారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాంతంత్ర్య వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల తర్వాత భాజపా ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విముక్తి దినోత్సవం నిర్వహించాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరిట కాకుండా సమైక్యతాదినం పేరిట వేడుకలు నిర్వహిస్తోందని విమర్శించారు.

Last Updated : Sep 17, 2022, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details