హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అమెరికా అంకాలజీ నెట్ వర్క్ ప్రతినిధుల బృందం ఇవాళ హైదరాబాద్‌లో మంత్రి ఈటల, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీఎస్ ఎస్కేజోషిలను కలిసింది. అమెరికాలో ఈ నెట్ వర్క్‌కు 140 కేంద్రాలు, 265 మంది వైద్యులు ఉన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన వినోద్ కుమార్ ఆహ్వానం మేరకు వైద్యుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పటికే దిల్లీ, అమృత్ సర్ లలోనూ బృందం పర్యటించింది.
ఈటలను కలిసిన అమెరికా అంకాలజీ నెట్వర్క్ బృందం - world class cancer hospital
అమెరికా అంకాలజీ నెట్వర్క్ ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సీఎస్ ఎస్కే జోషిలను కలిశారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు.
ఈటలను కలిసిన అమెరికా అంకాలజీ నెట్వర్క్ బృందం
ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు ఆలోచనలో నెట్ వర్క్ ఉండగా... అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ఈటల, వినోద్ చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలోని అంకాలజీ విభాగాన్ని కూడా అమెరికా బృందం సందర్శించింది. క్యాన్సర్ రోగ నిర్ధరణ, నివారణకు అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో... ఔట్ పేషంట్స్‌గా చికిత్స చేసే విధానం అందుబాటులోకి రానుందని అమెరికా వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: పెట్టుబడుల్లో సింగపూర్ మాకు ఆదర్శం