కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ఉద్యోగి సురేశ్‌కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ డయాగ్నోస్టిక్ కేంద్రంలో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్‌తో సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అతను తరచూ సురేష్ ఇంటికి వచ్చి వెళ్లేవాడని దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీనివాస్ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతుండగా... అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. మరోవైపు సురేష్ మృతదేహానికి గాంధీ మార్చురీలో శవపరీక్ష పూర్తయినందున... మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శాస్త్రవేత్త హత్యకేసులో పురోగతి... పరారీలో శ్రీనివాస్!
అమీర్‌పేటలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్త సురేశ్‌కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయనతో సన్నిహితంగా ఉండేవాడని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు.
శాస్త్రవేత్త హత్యకేసులో పురోగతి... పరారీలో శ్రీనివాస్