హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులు ఊడిపడి యువతి మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్ జేకే గార్గ్ అమీర్‌పేట్ స్టేషన్ వద్ద ప్రమాదస్థలిని పరిశీలించారు. ఘటనపై మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది. ఇది ప్రాథమిక తనిఖీ అని తదుపరి తనిఖీలు నిర్ణీత సమయంలో జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైన ఇంజినీరింగ్ పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ పర్యవేక్షణలో జరగనున్నాయి. అక్టోబర్ 3న మెట్రో రైల్భవన్లో సీఎంఆర్‌ఎస్ పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఇవాళ జరిగిన విచారణకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డీసీఎంఆర్‌ఎస్ రామ్ మెహెర్, ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు సంబంధించిన ఇంజినీర్లు హాజరయ్యారు.
అమీర్‌పేట్ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది.
అమీర్‌పేట్ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ