అవకాశమిస్తే.. డివిజన్‌ను అభివృద్ధి చేస్తా : చుక్క శైలజ - ghmc election campaign
ప్రజలకు ఇప్పుడే ఏ వాగ్దానాలు చేయనని, తనను గెలిపిస్తే డివిజన్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని అమీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చుక్క శైలజ అన్నారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అమీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చుక్క శైలజ
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని అమీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చుక్క శైలజ అన్నారు. ప్రజలకు ఏ వాగ్దానాలు చేయనని.. ప్రజలు మెచ్చుకునేలా.. వారికోసం పనిచేస్తానని తెలిపారు. అమీర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెరాస పాలనలో డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఒక్కసారి తనకు అవకాశమిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి :ఉన్నత చదువులు చదివా... అవకాశం ఇవ్వండి: సౌమ్య