బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటిన అమీర్‌ఖాన్, నాగచైతన్య కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్‌ఖాన్ స్వీకరించారు. హైదరాబాద్ నగరానికి చేరుకున్న అమీర్‌ఖాన్... బేగంపేట విమానాశ్రయం ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.
అమీర్‌ఖాన్‌తో పాటు తన సహానటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కతో సెల్ఫీలు తీసుకున్నారు.
మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు అమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఖాన్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణానాన్ని అందించిన వాళ్లమవుతామని అమీర్‌ఖాన్ వివరించారు.
హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులు భాగస్వాములయ్యారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా... ఇప్పటికే 16 కోట్లకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రజలు పండగలా జరుపుకునే ఏ సందర్భం వచ్చినా.. అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాగం చేస్తూ ఎంపీ సంతోష్ హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగానే.. దసరా పండుగకు ప్రతీ ఊరు, దేవాలయంలో జమ్మి చెట్టు నాటేలా ప్రణాళిక రచించారు. అందుకోసం ఇప్పటికే స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. హరిత తెలంగాణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించటమే లక్ష్యంగా గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను కొనసాగిస్తున్నట్టు ఎంపీ సంతోష్ తెలిపారు.
ఇవీ చూడండి: