చైనా, ఇటలీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇరాన్, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయం నుంచి నేరుగా వికారాబాద్‌లోని హరిత రిసార్ట్స్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు గానూ వివిధ జిల్లా నుంచి అంబులెన్స్‌లు తెప్పించి... కోఠిలోని ప్రజారోగ్య సంచాలకులు కార్యలయంలో సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే కరోనా అనుమానితులను తరలించే టెక్నీషియన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చింది.
అంతర్జాతీయ ప్రయాణికులు నేరుగా వికారాబాద్‌కే - interantional passengers moved to vikarabad resorts
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని వికారాబాద్ రిసార్ట్స్‌కి తరలించనున్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి అంబులెన్స్‌లను తెప్పించి సిద్ధంగా ఉంచింది.
విదేశాల నుంచి వచ్చేవారు నేరుగా వికారాబాద్‌కే