ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తిరువూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్ల ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. తుమ్మల దుర్గ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 108 వాహనం ఎంతసేపటికి రాలేదు ... అప్పటికి ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి మార్గమధ్యలో షాదీఖానా వద్ద రోడ్డుపైనే కూలబడిపోయింది. స్దానికుల సమాచారం మేరకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించడం సాధ్యం కాక అక్కడే కాన్పు చేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
ఆలస్యంగా 108వాహనం... రోడ్డుపైనే ప్రసవం... - తిరువురులో అంబులెన్స్ ఆలస్యంతో గర్భణి ఇబ్బందులు
ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో అవమానీయ ఘటన జరిగింది. 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆరోగ్యసిబ్బంది తెలిపారు.
![ఆలస్యంగా 108వాహనం... రోడ్డుపైనే ప్రసవం... 108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8375608-714-8375608-1597131088759.jpg)
108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...