తెలంగాణ

telangana

ETV Bharat / city

అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల - అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూలు ప్రకటించారు. అభ్యర్థులు సెప్టెంబరు 10లోగా ఆన్​లైన్​లో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ లక్ష్మారెడ్డి తెలిపారు.

ambedkar-open-university-admissions-notification-released
అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల

By

Published : Aug 22, 2020, 8:55 AM IST

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు సెప్టెంబరు 10లోగా ఆన్​లైన్​లో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జి.లక్ష్మారెడ్డి తెలిపారు.

డిగ్రీ, పీజీలో 2011 నుంచి 2019 వరకు చేరిన విద్యార్థులు కూడా అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం www.braouonline.in లేదా ‌www.braou.ac.inలో చూడవచ్చన్నారు.

ఇదీ చూడండి:'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details