తెలంగాణ

telangana

ETV Bharat / city

మోగిన 'అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్' బెల్ - amazon

వినియోగదారులందరికీ శుభవార్త... అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించింది. సెప్టెంబరు 29 అర్ధరాత్రి నుంచి విక్రయదారులకు 'గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​' అందుబాటులోకి రానుంది.

మోగిన 'అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్' బెల్

By

Published : Sep 17, 2019, 4:12 PM IST

Updated : Sep 17, 2019, 5:31 PM IST

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. 2019 ఏడాదికి గాను ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్’ను అమెజాన్‌ ప్రకటించింది. సెప్టెంబరు 29 అర్ధరాత్రి నుంచి విక్రయదారులకు ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉన్నవారికి మాత్రం సెప్టెంబరు 28 మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ అందుబాటులో ఉండనుంది. అక్టోబరు 4న అర్ధరాత్రి 12 గంటలకు సేల్‌ ముగియనుంది.

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఇతర వస్తువలపై డిస్కౌంట్‌ను ‘అమెజాన్‌’ ప్రకటించనుంది. ఈ సేల్‌లో టాప్‌ బ్రాండ్స్‌కు చెందిన వస్తువులను ‘అమెజాన్’ వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఇందులో వన్‌ప్లస్‌, శ్యాంసంగ్‌, వన్‌ప్లస్‌టీవీ, అమెజాన్‌ బేసిక్స్‌, మ్యాగి, మరికొన్ని కంపెనీలకు చెందిన వస్తువులు ఉన్నాయి. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో షాపింగ్‌ చేసిన వారికి డిస్కౌంట్‌ లభించనుంది.

‘ఫ్లిప్‌కార్ట్‌’కూడా తన బిగ్‌ బిలియన్స్‌ డేస్‌ సేల్‌ను సెప్టెంబరు 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. అక్టోబరు 4న ఈ సేల్‌ క్లోజ్‌ అవుతుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ‘అమెజాన్‌’ కన్నా ముందే తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. దీంతో అతిపెద్ద ఆన్‌లైన్‌ విక్రేత సంస్థలైన ‘అమెజాన్’, ‘ఫ్లిప్‌కార్ట్‌’ మధ్య పోటీ ఉండనుంది.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్​ క్యాంపస్​

Last Updated : Sep 17, 2019, 5:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details