ఆంధ్రప్రదేశ్లో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మొక్కవోని దీక్షతో అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 250వ రోజూ కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో రైతులు తమ నిరసనను తెలియజేసేందుకు సమాయత్తమయ్యారు. రాజధాని గ్రామాల్లో రణభేరి కార్యక్రమం ప్రారంభమయ్యింది.
రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు..వివిధ రూపాల్లో ప్రదర్శనలు
ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళనకారులు నిరసనలు ప్రదర్శించారు.
రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు..వివిధ రూపాల్లో ప్రదర్శనలు
తుళ్లూరు, మందడం, వెలగపూడిలో డప్పులు, పళ్లాలు మోగిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నాగలి, జోడెద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలతో రైతులు నిరసన ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. 3రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు అంటున్నారు.
ఇవీ చూడండి: 250వ రోజుకు చేరిన అమరావతి మహా ఉద్యమం