తెలంగాణ

telangana

ETV Bharat / city

కౌలు చెక్కుల కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు.. - Amaravati farmers protest for koulu raitu at crda office

Farmers Protest: కౌలు చెక్కులు ఇవ్వాలంటూ ఏపీలో అమరావతి రైతులు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 6 నెలలుగా అసైన్డ్ కౌలు చెక్కులు ఇవ్వట్లేదని రైతులు వాపోయారు. కౌలు చెక్కులు ఇవ్వాలంటూ అమరావతి ఎస్సీ రైతులు సీఆర్డీఏ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు.

amt farmers for cheques
amt farmers for cheques

By

Published : Jul 1, 2022, 5:34 PM IST

Farmers Protest For cheques at Tullur: కౌలు చెక్కులు ఇవ్వాలంటూ ఏపీలో అమరావతి ఎస్సీ రైతులు సీఆర్డీఏ అధికారులు కాళ్లపై పడ్డారు. ఆరు నెలలుగా రాజధానిలో అసైన్డ్ రైతులకు కౌలు చెక్కులు ఇవ్వటం లేదని.. రైతులు, మహిళలు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిప్యూటీ కలెక్టర్ సాయిబాబుని రైతులు డిమాండ్ చేశారు. విచారణ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. ఈ మేరకు ఆయనకు రైతులు వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details