Farmers Padayatra Amaravti 2021 : అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జనం నీరాజనం పలికింది. 26వ రోజు నెల్లూరు నగరంలోని శెట్టిగుంటరోడ్డు, వివర్స్‌కాలనీ, లక్ష్మీపురం, స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరుబస్టాండ్, పూలే విగ్రహం, విజయమహాల్‌గేటు, గాంధీబొమ్మ సెంటర్, వీఆర్‌సీ, హరినాథపురం మీదగా యాత్ర సాగింది. దారి పొడవునా వివిధ వర్గాలు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరు చేనేత సమాఖ్య ప్రతినిధులు మహిళలతో కలిసి నడిచారు. నేతన్నలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టారు. కోవూరు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల మీదుగా వెళ్తున్న రైతులు..ఆ చీరల్ని అక్కడ నిరాశ్రయులకు పంచిపెట్టి మానవత్వం చాటారు.
Farmers Padayatra Amaravati 2021 : రైతుల పాదయాత్రకు అడుగడుగునా జననీరాజనం
Farmers Padayatra Amaravati 2021 : చేతిలో జాతీయ జెండాలు, మెడలో ఆకుపచ్చ కండువాలు.. సంఘీభావం తెలుపుతున్న వివిధ వర్గాల ప్రజలు.! ఇలా అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా జననీరాజనం అందుతోంది. నేడు 27వ రోజు నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
Amaravati Farmers Padayatra 2021 : సాధారణంగా ఒక పార్టీ అనుచరులు కదిలితే ప్రత్యర్థి పక్షాలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటారు. రైతుల పాదయాత్రలో అవేమీ కనిపించలేదు. వైకాపా మినహా అన్ని పార్టీల నేతలూ యాత్రలో స్వచ్ఛందంగాపాల్గొంటున్నారు విరాళాలు అందజేయడంలోనూ ఇదే ఉత్సాహం కనబర్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి.. రైతులకు రెండు రోజులపాటు వసతి, ఆహారం అందజేయడంతో పాటు రూ.2లక్షల విరాళం అందజేశారు. అదే గ్రామానికి పెల్లకూరు శ్రీనివాసులరెడ్డి రూ.2లక్షల అందజేశారు. ఉదయగిరి సమీపంలోని కమ్మవారిపాళెం గ్రామస్థులు 32వేలు, నెల్లూరులో కె.పెంచలనాయుడు మిత్రమండలి రూ. 60వేలు, మాధవరావు మిత్ర బృందం రూ. 20వేలు విరాళం అందించింది. యాత్రకు అనూహ్య ఆదరణ లభిస్తోదంని ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు.
నేడు 27వ రోజు నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.