Amaravati maha padayatra:అమరావతి రైతుల మహాపాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. 12 కిలోమీటర్ల మేర సాగి మరిపల్లి వద్ద ముగియనుంది. జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించిన రైతులకు.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. పాదయాత్రలో భాజపా కిసాన్ మోర్చా నాయకులు సైతం పాల్గొన్నారు.
Padayatra stoped: అయితే పాదయాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను.. పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర వెంట వెళ్లరాదంటూ నిలిపివేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రచార రథాలను అడ్డుకోవడంపై.. రైతులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.