ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపితే.. అది అమరావతి ప్రజలకు మరణ శాసనం రాసినట్టే అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస ఆవేదన వ్యక్తం చేసింది. అమరావతి రాజధాని కాకుంటే... కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లను గవర్నర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు.
'బిల్లులు ఆమోదిస్తే.. కారుణ్య మరణాలకు అనుమతివ్వండి' - గవర్నర్కు విజ్ఞప్తి చేసిన అమరావతి రైతులు
రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లను ఏపీ గవర్నర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస సభ్యులు. ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపితే.. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలన్నారు.
'బిల్లులకు ఆమోదం తెలిపితే... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'
ఏపీ రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజలను ఆంధ్రా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని.. కౌలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతుందని ఐకాస సభ్యులు ఆరోపించారు. 220 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని.. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే తమ పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.