తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2020, 7:50 AM IST

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో అమరావతి ఉద్యమం ఉద్ధృతం

ఆంధ్రప్రదేశ్​లో రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రాజకీయ, రాజకీయేతర ఐకాస ప్రతినిధులు తీర్మానించారు. ఈనెల 10న విజయవాడలో రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్​లో అమరావతి ఉద్యమం ఉద్ధృతం
ఆంధ్రప్రదేశ్​లో అమరావతి ఉద్యమం ఉద్ధృతం

ఏపీలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రాజకీయ, రాజకీయేతర ఐకాస ప్రతినిధులు తీర్మానించారు. ఈనెల 10న విజయవాడలో రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించి 12 నుంచి 17వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని తీర్మానించినట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ, రాజకీయేతర జిల్లాస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం గుంటూరులో మంగళవారం నిర్వహించారు.

అమరావతి ఉద్యమం ఏడాదికి చేరుకుంటున్న తరుణంలో ఈనెల 12న గుంటూరులో భారీ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రాభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఇకనైనా జగన్‌ ఆ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు ఏడాది నుంచి రైతులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 12 నుంచి 17 వరకు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా.. మూడు రాజధానులకు అనుకూలంగా పెయిడ్‌ ఆర్టిస్టులతో ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమే ఉద్యమాలు చేయించడం జగన్‌ పాలనలోనే చూస్తున్నామని, ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు జనసేన ఉద్యమిస్తుందని స్పష్టంచేశారు.

ఐకాస జిల్లా కన్వీనర్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఈనెల 12న గుంటూరులో భారీ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. రింగ్‌రోడ్డులోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి గుజ్జనగుండ్ల, స్తంభాలగరువు, ఎన్టీఆర్‌ స్టేడియం, లక్ష్మీపురం మీదుగా లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు మహా పాదయాత్ర సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఐకాస ప్రతినిధులు గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్‌, మహిళా ఐకాస కన్వీనర్‌ రాయపాటి శైలజ, వేగుంట రాణి, భాష్యం నరసయ్య, లీగల్‌సెల్‌ నాయకులు శాంతకుమార్‌, మేళం భాగ్యారావు, దళిత ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, తలతోటి సురేంద్ర, తోకల రాజవర్దన్‌, లూధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొనసాగుతున్న వాయిదాల పర్వం... ఇబ్బందుల్లో స్థిరాస్తి వ్యాపారం

ABOUT THE AUTHOR

...view details