విజయవాడలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను అమరావతి మహిళా ఐకాస నేతలు కలిశారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆమెను కోరారు. అమరావతి రాజధానిగా గతంలో అన్ని పార్టీలు మద్దతు పలికాయని.. ప్రధాని శంకుస్థాపనకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజధానుల మార్పు సరికాదని.. ఏపీ సీఎం జగన్ ఇప్పటికైనా అమరావతిపై తన తీరు మార్చుకునేలా కేంద్రం చొరవ చూపాలని ఐకాస ప్రతినిధులు కోరారు.
'నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు' - విజయవాడలో నిర్మలా సీతారామన్ పర్యటన
అమరావతి మహిళా ఐకాస నేతలు విజయవాడలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను నిర్మలా సీతారామన్ అడిగి తెలుసుకున్నారు.

nirmala seetharaman
ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాజధానిపై భాజపా ఇదివరకే తీర్మానం చేసిందని నిర్మలా సీతారామన్ చెప్పారని.. ఆమెను కలిశాక రాజధానిగా అమరావతే ఉంటుందన్న తమ నమ్మకం రెట్టింపు అయిందని ఐకాస నేతలు తెలిపారు.
'కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు'
ఇదీ చదవండి:నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్‌రావు