తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravati farmers Reaction: 'కొత్త బిల్లు తెస్తామంటూ.. సరికొత్త నాటకమాడుతున్నారు' - ఐకాస నేతల ఆగ్రహం

AMARAVATHI FARMERS SERIOUS: న్యాయపోరాటంలో ఓడతామనే భయంతోనే వైకాపా ప్రభుత్వం 3 రాజధానులపై మళ్లీ బిల్లు తెస్తామంటూ కొత్త నాటకానికి తెరతీసిందని అమరావతి రైతులు, ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌కు పాలన చేతగాకపోతే తాము సలహా ఇస్తామని స్పష్టంచేశారు. ఉద్యమాన్ని మంత్రులు ఎగతాళి చేయడం మానుకోవాలని హితవు పలికారు.

AMARAVATHI FARMERS REACTION
AMARAVATHI FARMERS REACTION

By

Published : Nov 23, 2021, 11:21 AM IST

AP GOVT PASSES BILL TO REPEAL THREE CAPITAL LAWS: ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు చట్టాలనుఉపసరిస్తూనే... మళ్లీ బిల్లు తెస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమరావతి రైతులకు ఆక్రోశం తెప్పించింది. 3 రాజధానుల నిర్ణయం ఉపసంహరణపై మొదట మిఠాయిలు పంచుకున్న మహిళలు... అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం ప్రకటన చూసి నివ్వెరపోయారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమని ఆరోపించారు.

MAHA PADAYATRA: అమరావతిని అభివృద్ధి చేయడానికి.. డబ్బు లేదంటున్న వైకాపా ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు ఎలా తెస్తోందని అమరావతి రైతులు ప్రశ్నించారు. రాజధానుల తప్పిదాన్ని సరిద్దుకోకుండా... జగన్ మరో తప్పు చేయొద్దని అమరావతి ఐకాస నేతలు హితవు పలికారు. సోమవారం నెల్లూరు జిల్లా కావలి నుంచి కొండ బిట్రగుంట వరకూ పాదయాత్ర చేసిన ఐకాస నేతలు, రైతులు రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బస చేశారు.

అమరావతి ఉద్యమానికి వచ్చిన విరాళాల నుంచి వర్షాల వల్ల నష్టపోయిన నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు 5 లక్షల రూపాయల చొప్పున.. ఆర్థిక సాయం అందిస్తామని అమరావతి ఐకాస నేతలు వెల్లడించారు.

ఇదీ చదవండి:cylinder blast today video: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. 11 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details