ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు కొనసాగనున్న ఈ పాదయాత్రలో ఐకాస సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. 310రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా... ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ మొండి వైఖరిని మానుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన చేస్తే... దానికి కనీస విలువలేకుండా చేశారని రైతులు మండిపడ్డారు. ప్రధాని మోదీకి తమ బాధలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
మహా పాదయాత్రతో ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు - రైతుల మహాపాదయాత్ర వార్తలు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ గుంటూరులో ఐకాస ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. అమరావతి ఐకాస ప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
మహా పాదయాత్రతో ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు
ప్రభుత్వానికి కనువిప్పు కల్పించడమే ఈ మహా పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని, రాష్ట్రంలోని ప్రజలెవ్వరు మూడు రాజధానులు కోరుకోవటం లేదన్నారు. అమరావతిని సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఐకాస నేతలు, రైతులు తెలిపారు.