తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravati farmers Maha Padayatra: అలుపెరుగని పోరాటం.. ఏకైక రాజధానే అంతిమ లక్ష్యం - రాజధాని అమరావతి న్యూస్

ఏపీలోని నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర (Amaravati farmers maha padayatra) కొనసాగుతోంది. 26వ రోజు రాజుపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నేడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్​ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించి రైతులు యాత్ర ప్రారంభించారు.

Amaravati farmers Maha Padayatra
అమరావతి రైతుల మహా పాదయాత్ర

By

Published : Nov 26, 2021, 12:43 PM IST

Amaravati farmers Maha Padayatra: అలుపెరగకుండా సాగుతున్న అమరావతి రైతుల.. న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా రాజుపాలెం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు. నేడు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్, జగ్జీవన్​రామ్​కు నివాళలర్పించి పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని అమరావతి విషయంలో రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్​ మనసు మారి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నేడు 15 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.

45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుండగా.. డిసెంబరు 15న తిరుమలకు చేరుకునేలా అమరావతి ఐకాస నేతలు ప్రణాళిక రూపొందించారు.

ఇదీ చదవండి:Autocracy startup : రైతుల కోసం ఇద్దరు స్నేహితుల కృషి.. చక్ర -100 డిచర్​తో లాభాలెన్నో..

ABOUT THE AUTHOR

...view details