అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇంతగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందడంలో అన్నదాతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించారు. జగన్ పరిపాలన తమకొద్దంటూ నినాదాలు చేశారు. జగన్కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణాలో కలుపాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి' - amaravathi farmers protest updates
ఏపీ రాజధాని మార్పు ప్రతిపాదనలను నిరసిస్తూ... అమరావతి ప్రాంత రైతుల ఆందోళన, నిరసనలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. జగన్కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు.
amaravathi