తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​ వాయిదా - AP farmers bail petition pending

ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై ఇవాళ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 5కి వాయిదా వేసింది.

amaravathi-farmers-bail-petetion post poned to november fifth
అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​ వాయిదా

By

Published : Nov 2, 2020, 10:36 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్థానం... తీర్పుని ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో 11మందిపై ఎస్సీ వేధింపుల చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఇందులో ఏడుగురు అరెస్టయి... ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వారు పెట్టుకున్న అభ్యర్థన ఇవాళ జిల్లా కోర్టు ముందుకు రాగా.. నిర్ణయాన్ని 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు

ABOUT THE AUTHOR

...view details