ప్రజారాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపీలో అమరావతి గ్రామాల రైతులు.. ఆందోళనలు ఉద్ధృతం చేశారు. శుక్రవారం నాటి పోలీసుల చర్యలను తమకు జరిగిన పరాభవంగా భావించిన మహిళారైతులు మరింత పట్టుదలతో నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ చేపట్టారు. టెంట్లు వేసేందుకు పోలీసులు నిరాకరించినా... రోడ్లపైనే బైఠాయించి ఆందోళనలు కొనసాగించారు. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. రాత్రివేళల్లో పోలీసులు ఇళ్లలోకి చొరబడి తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. కమిటీల పేరుతో ప్రభుత్వం మోసగిస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు.
ఆవేదనతో రైతు మృతి
మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులకు చుట్టుపక్కల గ్రామాలు, కృష్ణా జిల్లా రైతుల నుంచి మద్దతు లభిస్తోంది. దొండపాడు, నేలపాడు, నెక్కల్లు, బోరుపాలెం, వెంకటపాలెం నుంచి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. మందడంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు మల్లికార్జునరావుకు నివాళులు అర్పించారు. మహిళలపై పోలీసుల దాడిని నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు వర్తక, విద్యాసంస్థలను మూసివేయించారు. బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులే తమపై దౌర్జన్యాలకు పాల్పడితే ఎవరితో చెప్పుకోవాలంటూ వాపోయారు.
హిందూ మహాసభ సంఘీభావం