Amaravathi Farmers protest : అమరావతి రైతుల పోరాటం.. ఇవాళ్టితో 750 రోజులకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో.. అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆగిన అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రం పేరిట.. తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, అనంతవరంలో సదస్సులు నిర్వహించనుంది. ఏపీ ప్రభుత్వం ఇంకా అమరావతిపై కుట్రలు మానలేదని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన.. కుట్రలో భాగమేనంటున్నారు.
Amaravathi Farmers protest : 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
Amaravathi Farmers protest : ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటం 750వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆగిన అమరావతి నిర్మాణం-అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర పేరిట సదస్సులు జరగనున్నాయి.
![Amaravathi Farmers protest : 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం AP Capital amaravathi protest,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14098342-474-14098342-1641349932182.jpg)
అమరావతి రైతుల పోరాటం
ఈ విషయాలను ప్రజా చైతన్య సదస్సుల ద్వారా అందరికీ వివరించనున్నట్లు ఐకాస నేత సుధాకర్ తెలిపారు. రాజధాని గ్రామాల్లో ఇవాళ్టి నుంచి జరిగే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా.. రైతులు అభ్యంతరాలను తెలియజేయనున్నారు.
ఇదీ చదవండి:Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత..