తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి ఉద్యమానికి ఐర్లాండ్​లో సంఘీభావం

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా విదేశాల్లోని తెలుగు వారు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఐర్లాండ్​లో 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని'... అంటూ నినదించారు.

By

Published : Jul 4, 2020, 5:10 PM IST

amaravathi
'అమరావతి'కి విదేశాల్లోని తెలుగు ప్రజల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ కొనసాగుతున్న ఉద్యమం... 200 రోజులకు చేరిన సందర్భంగా విదేశాల్లోని తెలుగు ప్రజలు సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని'... అంటూ నినదించారు. 200 రోజులుగా జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతిని కాపాడుకుందామని ప్రతినబూనారు.

ఐర్లాండ్​లో డబ్లిన్, కోర్క్, డండాల్క్, ఎత్లోన్, గాల్వే నగరాల్లో ఈ ప్రదర్శనలు సాగాయి. కొందరు సామూహికంగా ప్రదర్శనలో పాల్గొనగా... మరికొందరు ఇళ్లలోనే అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

'అమరావతి'కి విదేశాల్లోని తెలుగు ప్రజల సంఘీభావం

ఇదీ చదవండి:సమరావతి@ ఆ 29 గ్రామాల్లో 'అ' అంటే.. అమరావతే

ABOUT THE AUTHOR

...view details