తెలంగాణ

telangana

ETV Bharat / city

"వీరుడా.. అందుకో మా జోహార్లు".. ఆకట్టుకుంటున్న అల్లూరి సైకత శిల్పం - ఆకట్టుకుంటున్న అల్లూరి సైకత శిల్పం

'వీరుడా.. అందుకో మా జోహార్లు' అన్న నినాదంతో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలు సోహిత, ధన్యతలతో కలిసి రూపొందించిన అల్లూరి సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. విప్లవ వీరుడు అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని సైకత శిల్పం ఏర్పాటు చేశారు.

"వీరుడా.. అందుకో మా జోహార్లు".. ఆకట్టుకుంటున్న అల్లూరి సైకత శిల్పం
"వీరుడా.. అందుకో మా జోహార్లు".. ఆకట్టుకుంటున్న అల్లూరి సైకత శిల్పం

By

Published : Jul 3, 2022, 8:37 PM IST

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలు సోహిత, ధన్యతలతో కలిసి రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. 'వీరుడా.. అందుకో మా జోహార్లు' అన్న నినాదంతో భుజాన విల్లు ధరించి వీరత్వం, పౌరుషం నిండిన అల్లూరి రూపంతో పాటు.. ఆయన వెనుక స్వేచ్ఛగా ఎగురుతున్న జాతీయ పతాకాన్ని తీర్చిదిద్దారు. సుమారు 12 గంటలు శ్రమించి సైకత శిల్పం రూపొందించి అల్లూరికి ఘన నివాళులు అర్పించారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details