తెలుగులో జానపద, పౌరాణిక చిత్రాలకు ఆదరణ తగ్గిన తర్వాత ఎక్కువగా సాంఘిక చిత్రాలు తెరకెక్కాయి. అదే రోజుల్లో రాజమహేంద్రవరానికి చెందిన గరికిపాటి రాజారావు వైద్యవృత్తిలో ఉంటూ.. ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో, నాటకాల్లో చురుగ్గా పాల్గొంటూ వుండేవారు. ఆయన సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమా నిర్మించాలని 1953లో 'పుట్టిల్లు' అనే సినిమా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత నటీమణి జమునతో పాటు మరొక నటుడు కూడా కొత్తగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనే హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య. రేలంగి తర్వాత 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్న రెండవ హాస్యనటుడు ఆయనే. గొప్ప మానవతావాది కూడా. ఈ రోజు అల్లు రామలింగయ్య జయంతి. ఈ సందర్భంగా హాస్యానికి కొత్త భాష్యం చెప్పి, నవ్వుల గుండెల్లో కొలువుంటానని చాటిచెప్పిన 'అల్లు' రామలింగయ్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
పాలకొల్లు నుంచి ప్రస్థానం...
అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. తండ్రి వెంకయ్యకి ఏడుగురు సంతానం. వారిలో రామలింగయ్య నాలుగోవారు. రామలింగయ్యకు చదువు సంధ్యలు అబ్బలేదు. ఎప్పుడూ ఆకతాయి కుర్రాడిలా తిరిగేవారు. ఆట పాటలతో పాటు తన సహచరులను సరదాగా నవ్విస్తూ వుండేవారు. నాటకాలను బాగా చూసేవారు. అప్పట్లో నాటకాల కంపెనీలు ఊరూరా తిరుగుతూ ఉండేవి. ఆ కంపెనీ మేనేజర్ల చుట్టూ తిరుగుతూ నాటకాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. ఒకసారి 'భక్త ప్రహ్లాద' అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ వేషాన్ని అదురూ బెదురూ లేకుండా రక్తి కట్టించారు రామలింగయ్య.
మొదట డబ్బులు ఎదురిచ్చి నాటకాల్లో వేషాలు సంపాదిస్తూ రామలింగయ్య నట జీవితం మొదలైంది. గాంధీజీ 1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమానికి పిలుపిచ్చే సమయానికి రామలింగయ్యకు ఇరవై ఏళ్లు. సామాజిక బాధ్యతను గుర్తించిన రామలింగయ్య యువతను ఉత్తేజపరచి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాజమండ్రి జైలుకెళ్లారు. అక్కడ తన సహచర సమరయోధుల్ని నవ్విస్తూ చిన్న చిన్న నాటకాలు వేస్తూ, బుర్రకథలు చెబుతూ అందరికీ వినోదం పంచేవారు. జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు వారితో చేరి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. అప్పుడే గరికిపాటి రాజారావుతో ఆయనకు పరిచయమైంది.
సినిమాల్లోకి ప్రవేశం...