సినీ హారో అల్లు అర్జున్ని కలవడం కోసం 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడో అభిమాని. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడుకి చెందిన పాత నాగేశ్వరరావు.. బన్నీపై ఇష్టానికి... సంకల్పం తోడు చేసుకుని ముందుకు సాగాడు. సెప్టెంబర్ 17న బయలుదేరి ఎండా, వాన లెక్కచేయకుండా.. 23వ తేదీకి హైదరాబాద్ చేరుకున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. అక్టోబర్ 2న అతడిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు అడిగి, ఆరోగ్యంపై ఆరా తీశారు. నాగేశ్వరరావు అభిమానంతో ఉద్వేగానికి లోనయ్యారు. మరోసారి ఇటువంటి సాహసాలకు పాల్పడవద్దని సూచించారు. తనను కలవాలంటే నేరుగా వచ్చి కలవచ్చని చెప్పారు.
అభిమాన హీరోను కలిసేందుకు 6 రోజుల పాదయాత్ర! - అభిమాన హీరోను కలిసేందుకు 6 రోజుల పాదయాత్ర
సినిమా నటులపై తమకున్న ఇష్టాన్ని అభిమానులు రకరకాలుగా చూపిస్తుంటారు. ఫంక్షన్లలో భద్రతా సిబ్బందిని దాటుకుని కొందరు, వ్యక్తిగత పనులపై నటులు బయటకు వెళ్లిన సమయంలో మరికొందరు కరచాలనం కోసం, ఫొటో దిగడం కోసం ఆరాటపడుతుంటారు. ఇవన్నీ కాదని ఏకంగా 250 కిలోమీటర్లు నడిచాడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగేశ్వరరావు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలనే తన కల నిజం చేసుకోవడానికి సొంతూరు నుంచి దాదాపు వారం పాటు పాదయాత్ర చేపట్టాడు.
![అభిమాన హీరోను కలిసేందుకు 6 రోజుల పాదయాత్ర! allu-arjun-fan-walked-250-kms-to-meet-him](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9040678-382-9040678-1601743076489.jpg)
అభిమాన హీరోను కలిసేందుకు 6 రోజుల పాదయాత్ర!
అభిమాన హీరోను కలిసేందుకు 6 రోజుల పాదయాత్ర!
నాగేశ్వరరావుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం. ఒక్కసారైనా తన అభిమాన హీరోని కలవాలని కలలు కన్నాడు. ఆరు రోజుల నడక అనంతరం.. స్నేహితుడి ఇంటి వద్ద ఉపశమనం పొందాడు. బన్నీ నుంచి పిలుపు రావడంతోనే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆయనను కలిసి కొంతసేపు ముచ్చటించాడు. అల్లు అర్జున్తో మాట్లాడగానే.. వందల కిలోమీటర్లు నడిచిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికంలో కోత