పాలిటెక్నిక్ తుది విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 120 పాలిటెక్నిక్ కళాశాలల్లో 24,401 సీట్లు భర్తీ అయ్యాయి. 52 పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. తుది విడత పూర్తయ్యేటప్పటికి రాష్ట్రంలో 4,653 పాలిటెక్నిక్ సీట్లు మిగిలాయి.
ts polycet 2021: రాష్ట్రంలో మిగిలిన 4,653 పాలిటెక్నిక్ సీట్లు
15:55 August 28
పాలిటెక్నిక్ తుది విడత సీట్లు కేటాయింపు
ఈ ఏడాది పాలిసెట్ లో 75 వేల 669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 120 కాలేజీల్లో 29 వేల 54 సీట్లు ఉండగా.. 83.98 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరో 16.02 శాతం సీట్లు మిగిలాయి. రాష్ట్రంలోని 54 ప్రభుత్వ కాలేజీల్లో 11874 పాలిటెక్నిక్ సీట్లు ఉండగా...11 వేల 624 కేటాయింపు పూర్తయి.. 250 మిగిలాయి. 65 ప్రైవేట్ కాలేజీల్లోని 16 వేల 950 సీట్లలో.. 12 వేల 550 సీట్లు భర్తీ కాగా.. 4 వేల 400 మిగిలాయి.
తుది విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 31లోగా ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. సెప్టెంబరు 1 నాటికి కాలేజీకి వెళ్లి చేరాలని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 4 వరకు ఓరియంటేషన్ నిర్వహించి.. 6 వ తేదీ నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభించనున్నట్లు నవీన్ మిత్తల్ వెల్లడించారు.
ఇదీ చూడండి:
MALLAREDDY: 'రేవంత్ బ్లాక్మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'