తిరుమల శ్రీ వారి సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా అందించనునున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో ఉచిత దర్శన టోకెన్లు ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తామని చెప్పారు.
TTD: వారం రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ.. - తితిదే సర్వదర్శనం
శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. వారం రోజుల్లో టోకెన్లు అందిస్తానని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు.
తితిదే
సాంకేతిక సమస్యతో సర్వదర్శన టోకెన్ల జారీ ఆలస్యమయిందని తితిదే వెల్లడించింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు జియో సహకారం కూడా తీసుకుంటున్నామని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సర్వదర్శన టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Ganesh Immersion: నిమజ్జనోత్సవానికి ముస్తాబవుతున్న ట్యాంక్‌బండ్.. చకచకా ఏర్పాట్లు