తెలంగాణ

telangana

ETV Bharat / city

'జస్టిస్​ రామ్మోహన్​రావు కుటుంబం వేధిస్తోంది' - allegations on justice noothi rammohan rao

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ నూతి రామ్మోహన్​రావు కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆయన కోడలు సింధుశర్మ ఆరోపించారు. ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారని వాపోయారు. ఇప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.

'జస్టిస్​ నూతి రామ్మోహన్​రావు కుటుంబం చిత్రహింసలకు గురిచేశారు'

By

Published : Sep 20, 2019, 7:36 PM IST

'జస్టిస్​ నూతి రామ్మోహన్​రావు కుటుంబం చిత్రహింసలకు గురిచేశారు'
అత్తమామలు, భర్త.. చిత్రహింసలకు గురిచేసి మానసికంగా హింసించారని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ నూతి రామ్మోహన్​రావు కోడలు సింధుశర్మ ఆరోపించారు. పెద్ద ఇంటి కోడలుకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నా.. కేవలం పిల్లల కోసమే భరిస్తూ వచ్చానని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఇద్దరు అమ్మాయిలున్నారని.... ఇప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ తన భర్త మాత్రం విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడని వాపోయారు. తనకు న్యాయం చేయాలని సింధూశర్మ కోరారు.

ABOUT THE AUTHOR

...view details