- హైదరాబాద్ నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల. కొన్ని నెలల కిందట కళాశాలలో పనిచేసే ఆచార్యుడ్ని ప్రిన్సిపల్‌గా నియమించేందుకు ఆమోదం కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసింది. సదరు ఆచార్యుడికి ప్రిన్సిపల్‌గా అర్హతలు లేవు. జేఎన్‌టీయూ గుర్తించని వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసినట్లు చూపించారు. దీనికితోడు సదరు ఆచార్యుడు గతంలో పనిచేసిన కళాశాలలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఒడిశాలోని యూనివర్సిటీ నుంచి చేసినట్లుగా చూపించారు. వాస్తవానికి సదరు యూనివర్సిటీలో అసలు బీటెక్ మినహా ఇతర కోర్సులేవీ లేవు. గతంలో పనిచేసిన కళాశాలకు సమర్పించిన సర్టిఫికెట్లకు, ప్రస్తుతం పనిచేస్తున్న కళాశాలలో ఇచ్చిన సర్టిఫికెట్లకు పొంతన లేదు. అయినా యాజమాన్యం అండదండలతో నకిలీ అర్హత పత్రాలు చూపించి ప్రిన్సిపల్ అయ్యేందుకు వర్సిటీకి దరఖాస్తు చేశారు. దీనిపై స్టాఫ్ సెలక్షన్ కమిటీ మినిట్స్(ఎస్‌సీఎం)లో ఆచార్యుడి అర్హతలు పరిశీలించి నియామకం చెల్లదని స్పష్టం చేయాలి. వర్సిటీ అధికారులు సదరు ఆచార్యుడి నియామకాన్ని ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఖమ్మం సమీపంలోని మరో ఇంజినీరింగ్ కళాశాల. ప్రిన్సిపల్ పీహెచ్‌డీని అమెరికాలో చేసినట్లు చూపించారు. వాస్తవానికి ఇది ఆన్‌లైన్ విశ్వవిద్యాలయం కాగా మన వద్ద ఎలాంటి గుర్తింపు లేదు. అతనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు జేఎన్‌టీయూ అధికారులు విచారణ చేసి ప్రిన్సిపల్‌గా అర్హత లేదని తేల్చారు. ఆన్‌లైన్ డిగ్రీలు చెల్లవని యూజీసీ స్పష్టం చేసినా, జేఎన్‌టీయూకు చెందిన మరో అధికారి అతన్ని ర్యాటిఫై చేశారు.
కాసులు కుమ్మరిస్తే చాలు.. అర్హత, ధ్రువపత్రాలు లేకున్నా సులువుగా కావాల్సిన పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు అందలం దక్కుతోంది. పర్యవేక్షణ కొరవడి జేఎన్టీయూ అధికారులు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రక్రియ ఇలా జరగాలి..