తెలంగాణ

telangana

ETV Bharat / city

గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభం

మార్చి నుంచి కేవలం కొవిడ్​ సేవలకు మాత్రమే పరిమితమైన గాంధీ ఆసుపత్రిలో ఎట్టకేలకు మిగితా సేవలను అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఈ సేవలను ప్రారంభమయ్యాయి. కొవిడ్​ రోగులు తగ్గిన దృష్ట్యా... ఈ నిర్ణయం తీసుకున్నారు.

all types of medical services started in gandhi hospital from today
all types of medical services started in gandhi hospital from today

By

Published : Nov 21, 2020, 7:16 AM IST

హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్చి నుంచి ఈ ఆసుపత్రిని కేవలం కొవిడ్‌ సేవలకు కేటాయించి మిగతా అన్నిరకాల ఓపీ, శస్త్ర చికిత్సలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడకు వచ్చే కొవిడ్‌ రోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 1,890 పడకలు ఉండగా 268 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఇందులో అధికశాతం ఐసీయూలో ఉన్నారు. మరోవైపు సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని వైద్య విద్యార్థులు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తూ వినతులు సమర్పించారు. దాదాపు 8 నెలల తర్వాత గాంధీ సాధారణ స్థితికి రానుంది. ఆసుపత్రిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

ప్రత్యేక జాగ్రత్తలు

*అన్ని విభాగాల ఓపీ, ఐపీతోపాటు ఎంపిక చేసిన, అత్యవసర శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తెస్తున్నారు.

*ఇక్కడకు వచ్చేవారు మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలి

*రోగితో ఒక సహాయకుడిని మాత్రమే తీసుకురావాలి. ఇతర వ్యక్తులను అనుమతించరు.

*అత్యవసర విభాగంతోపాటు ప్రధాన విభాగంలోని రెండు, మూడు అంతస్తులను కేవలం కొవిడ్‌ సేవలకు కేటాయించారు. ఇతర రోగులు అటు వెళ్లకుండా బారికేడ్లు ఉన్నాయి.

*170 మంది సర్వీసు రెసిడెంట్లతోపాటు మెడిసిన్‌, పల్మనాలజీ విభాగానికి చెందిన 60 మంది పీజీలు, 30 మంది ఫ్యాకల్టీ సభ్యులు కరోనా రోగులకు చికిత్సలు అందిస్తారు.

ఇదీ చూడండి: కసరత్తు ముగిసింది.. ప్రచారమే మిగిలింది..

ABOUT THE AUTHOR

...view details