హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని సీవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను భాజపా, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. నగరంలో డెంగీ వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందడానికి మురుగునీరే కారణమని వారు స్పష్టం చేశారు. భాజపా నేతలు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, కరుణాగోపాల్... కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ట్యాంక్‌బండ్ సమీపంలోని నాలాలను పరిశీలించారు. నాలాలో పేరుకుపోయిన చెత్తచెదారం వల్లే దోమలు వ్యాప్తిచెందినట్లు వెల్లడించారు. ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని సీవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ సందర్శనకు వెళ్లిన నేతలు అక్కడ సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని పేర్కొన్నారు.
సీవేజ్ వాటర్ ప్లాంట్ పరిశీలించిన అఖిలపక్షం - BJP
మహానగరంలో విషజ్వరాలు వ్యాప్తి చెందటం పట్ల అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్, ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని సీవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను భాజపా, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు విజృంబించాయని ఆగ్రహం వక్తం చేశారు.
"సీవేజ్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించిన అఖిలపక్షం"