మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన విధంగా నిర్వహించాలని కోరుతూ.. ఇవాళ అఖిల పక్ష నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. తెదేపా, తెజస, సీపీఐ నేతలు సంయుక్తంగా ఎన్నికల కమిషనర్‌కు లేఖను సమర్పించారు. నూతన పురపాలక చట్టం ద్వారా ఎన్నికల సంఘం హక్కులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఎన్నికలపై అందరికీ సమాన హక్కు ఉంటుందని... అన్ని పక్షాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీ ఖరారు, నిర్వహణపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
పుర ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: అఖిలపక్షం - municipal elections
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు తెదేపా, తెజస, సీపీఐ నేతలు సంయుక్తంగా లేఖ ఇచ్చారు.
all party meeting