ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన అఖిలపక్షం నేతలు కోదండరాం, మల్లు భట్టి విక్రమార్క, వి.హన్మంతరావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, చెరుకు సుధాకర్ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంభిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై మొక్కుబడిగా మాత్రమే చర్చలు జరిపినట్లు గవర్నర్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. వినతుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యపై దృష్టి సారిస్తామని గవర్నర్ తెలిపినట్లు కోదండరాం వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.