ఇంటర్ మృతుల కుటుంబాలకు అఖిలపక్షం సాయం - all party leaders helps inter victims family by giving one lakh rupees as exgatia
ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి అఖిల పక్ష నేతలు, తెలంగీ పీపుల్స్ సొసైటీ పేరిట ముందుకొచ్చారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
all party leaders helps inter victims family by giving one lakh rupees as exgatia
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కారణంగా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి అఖిలపక్ష నేతలు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా తెలంగీ పీపుల్స్ సొసైటీ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి తల్లి సరస్వతికి లక్ష రూపాయల చెక్కును అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు లక్ష రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా