ఇబ్రహీంపట్నంలో అఖిలపక్షం కార్యకర్తల ఆందోళన - ఆర్టీసీ కార్మికులకు అఖిల పక్షం కార్యకర్తల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అఖిల పక్ష కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇబ్రహీంపట్నంలో అఖిలపక్షం కార్యకర్తల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఎనిమిది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందలాది కార్మికులు నోటికి నల్ల వస్త్రం కట్టుకుని నిరసన తెలిపారు.
- ఇదీ చూడండి : 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు'