అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్లో ఒకటిగా... ఏ1 గ్రేడ్ జాబితాలో స్వచ్ఛ స్టేషన్‌గా జాతీయ స్థాయిలో తిరుపతి స్టేషన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదిగో ఈ అంశాన్నే లోక్‌సభ ఉపఎన్నికల వేళ రాజకీయ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. స్మార్ట్ రైల్వే స్టేషన్‌లో భాగంగా 450 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. తమను గెలిపిస్తే పార్లమెంట్ లోతమ వాణి వినిపించి స్టేషన్ అభివృద్ధికి పాటుపడతామని హామీలు గుప్పిస్తున్నారు.
ఎప్పుడవుతుందో..?
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా.. అందుకు తగినట్లుగా తిరుపతి స్టేషన్‌లో ప్లాట్ ఫాంల సంఖ్య లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో రైళ్లు చేరుకున్నా.. నిలిపేందుకు ఖాళీ లేకపోవటంతో.. గంటల తరబడి రేణిగుంట జంక్షన్‌లోనే ఆపేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో దక్షిణం వైపు చేపట్టిన ఆరో నెంబర్ ప్లాట్‌ఫారం పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాస్తలో కాస్త మెరుగ్గా తిరుచానూరు టర్మినల్ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. అవి ఎప్పటికి పూర్తవుతాయనే విషయంలో స్పష్టత లేదు.
మా వల్లనే అభివృద్ధి