తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు' - ashwathama reddy on tsrtc strike

ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ఆలిండియా ట్రాన్స్‌పోర్టు కన్వీనర్ కేకే దినకర్ ప్రకటించారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

tsrtc strike

By

Published : Oct 16, 2019, 6:05 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ఆలిండియా ట్రాన్స్‌పోర్టు కన్వీనర్ కేకే దినకర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజా మద్దతు ఉందని చెప్పారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు దినకరన్ పేర్కొన్నారు. బంద్‌లో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 12వ రోజు కూడా సమ్మె ఉద్ధృతంగా సాగుతోందని... ప్రభుత్వ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తమ సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు పలికినట్లు చెప్పారు.

'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'

ABOUT THE AUTHOR

...view details