తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్మికసంఘాల సమ్మెకు పూర్తి మద్దతు : ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం - ఎల్​ఐసీ వార్తలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ..ఈ నెల 26న కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత ఎల్​ఐసీ ఉద్యోగుల ఫెడరేషన్ కోరింది. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నిధులను కేంద్రం ఇష్టారాజ్యంగా వాడుకుంటోందని... లాభాల్లో ఉన్న ఎల్.ఐ.సితోపాటు.. ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను తీసుకొస్తోందని ఎల్.ఐ.సి ఉద్యోగుల సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి రఘునాథన్ విమర్శించారు.

all-india-lic-employees-federation-supporting-november-26-national-strike
కార్మికసంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించిన ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం

By

Published : Nov 23, 2020, 7:47 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ... కార్మిక సంఘాలన్నీ సంయుక్తంగా నవంబర్ 26న నిర్వహించ తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత ఎల్​ఐసీ ఉద్యోగుల ఫెడరేషన్ కోరింది. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేకచట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించేలా చేపడుతున్న చర్యలను నిరసిస్తూ.. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు తాము మద్దతిస్తున్నామని ఎల్​ఐసి ఉద్యోగుల ఫెడరేషన్ తెలిపింది.

కార్మికసంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించిన ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసేలా.. చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తూ.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న సమ్మె చేస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని ఎల్​ఐసీ ఉద్యోగుల సౌత్ సెంట్రల్ జోన్ ప్రతినిధులు హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.

కేంద్రం.. ఎల్​ఐసీ, ఆర్బీఐల నుంచి నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటోందని... లాభాల్లో ఉన్న ఎల్​ఐసీతోపాటు.. ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను తీసుకొస్తోందని ఎల్​ఐసీ ఉద్యోగుల సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి రఘునాథన్ విమర్శించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడుల యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వాహన పన్ను రద్దుతో నిర్వాహకుల్లో ఆనందం

ABOUT THE AUTHOR

...view details