తెలంగాణ

telangana

ETV Bharat / city

'విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలి' - హోంగార్డు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఆల్ ఇండియా హోం గార్డ్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అమరులైన హోం గార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బాధితు కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబాలను ఆదుకోవాలి'
'విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబాలను ఆదుకోవాలి'

By

Published : Dec 6, 2020, 3:35 PM IST

ఎన్నో ఏళ్ళుగా పోలీస్ శాఖలో పనిచేస్తూ... విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని అల్ ఇండియా హోం గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చకినాల నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 58వ హోంగార్డ్స్ వార్షికోత్సవం సందర్భంగా... హోంగార్డు అమరుల కుటుంబాల పిల్లలకు బాలాజీ టాక్స్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ కిట్​తోపాటు ఆర్థిక సాయం అందచేశారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రెండు పడక గదుల ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించి... మాట తప్పారని విమర్శించారు. ఇప్పటికైనా హోంగార్డుల కుటుంబాలను అదుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా హోంగార్డులుగా పని చేసినా... పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పోషించలేక, చదివించలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'సూపర్​ జవాన్ల' కోసం చైనా భయంకర ప్రయోగాలు!

ABOUT THE AUTHOR

...view details